HS Prannoy: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌.. సెమీస్‌ రేసు నుంచి ప్రణయ్‌ ఔట్‌

భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడి సెమీస్ అవకాశాలను చేజార్చుకొన్నాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్ పోటీల్లో తాజాగా చైనా ఆటగాడి చేతిలో పరాజయం పాలయ్యాడు.

Published : 09 Dec 2022 01:02 IST

ఇంటర్నెట్ డెస్క్: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్ ఫైనల్స్‌ పోటీల్లో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్‌ పోరాటం ముగిసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ప్రణయ్‌ను ఓడించిన చైనా షట్లర్ గ్వాంగ్‌ జు చేతిలో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో గ్వాంగ్‌ జు చేతిలో ఓడిపోయాడు. 

దాదాపు 84 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 21-23, 21-17, 19-21 తేడాతో ప్రణయ్‌పై గ్వాంగ్‌ విజయం సాధించాడు. దీంతో గ్రూప్‌-ఏలో వరుసగా రెండు పరాజయాలు పొందడంతో సెమీస్‌ రేసు నుంచి ప్రణయ్‌ వైదొలిగినట్లే. అంతకుముందు (బుధవారం) గ్రూప్ స్టేజ్‌ తొలి మ్యాచ్‌లోనూ పోరాడి ఓడాడు. జపాన్‌ ఆటగాడు కొడాయ్‌ నరవొక చేతిలో 12-21, 21-9,17-21 తేడాతో పరాజయం చవిచూశాడు. అనవసర తప్పిదాలతో ప్రణయ్‌ మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఇక తన చివరి మ్యాచ్‌లో నంబర్‌వన్ ఆటగాడు, ఒలింపిక్ పతక విజేత విక్టోర్ యాక్సల్‌సెన్‌తో ప్రణయ్‌ శుక్రవారం తలపడతాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని