Pat Cummins: చితక్కొట్టడంలో ఇదొక అత్యుత్తమ ప్రదర్శన.. కమిన్స్‌పై ప్రశంసల వర్షం

కోల్‌కతా ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ గతరాత్రి ముంబయిపై సంచలన ప్రదర్శన చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. కేవలం 14 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి టీ20 లీగ్‌లో...

Published : 07 Apr 2022 11:20 IST

మీమ్స్‌తో అలరిస్తున్న నెటిజన్లు

(Photo: Pat Cummins Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ గతరాత్రి ముంబయిపై అద్భుతంగా ఆడటంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. కేవలం 14 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి టీ20 లీగ్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు. దీంతో పంజాబ్‌ తరఫున కేఎల్‌ రాహుల్‌ 2018లో దిల్లీపై నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబయి నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16 ఓవర్లలోనే పూర్తి చేయగా.. కమిన్స్‌ (56 నాటౌట్‌; 15 బంతుల్లో 4x4, 6x6) విశ్వరూపం ప్రదర్శించాడు. మరోవైపు ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (50 నాటౌట్‌; 41 బంతుల్లో 6x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు. అయితే, సామ్స్‌ వేసిన 16వ ఓవర్‌లోనే కమిన్స్‌ 35 (6,4,6,6,2(నోబాల్‌),4,6) పరుగులు సాధించి రోహిత్‌ సేనకు ఊహించని షాకిచ్చాడు. దీంతో అతడిపై కోల్‌కతా యజమాని షారుఖ్‌ ఖాన్‌తో పాటు పలువురు మాజీలు పొగడ్తల వర్షం కురిపించారు. మరోవైపు అభిమానులు, నెటిజన్లు మీమ్స్‌తో అలరిస్తున్నారు. ఎవరెవరు ఎలా స్పందించారో మీరూ ఓ లుక్కేయండి.












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని