Volly ball: పల్లవోలో పడోవాతో హైదరాబాద్‌ బ్లాక్ హాక్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం

భారతదేశపు ప్రీమియర్ వాలీబాల్ జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, ఇటలీలోని సూపర్‌లిగాకు చెందిన ప్రముఖ క్లబ్ పల్లవోలో పడోవాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Published : 19 May 2023 20:22 IST

హైదరాబాద్: భారతదేశపు ప్రీమియర్ వాలీబాల్ జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, ఇటలీలోని సూపర్‌లిగాకు చెందిన ప్రముఖ క్లబ్ పల్లవోలో పడోవాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రాబోయే నెలల్లో ఇటలీలో శిక్షణ కోసం బ్లాక్ హాక్స్ అనేక మంది ఆటగాళ్లను పంపుతుంది. ప్రతిగా, భారతదేశ మొట్టమొదటి ప్రపంచ స్థాయి కోచింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, యూత్ ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించడంలో బ్లాక్ హాక్స్‌కు సహాయం చేయడానికి పడోవా అక్కడి నుంచి నిపుణులైన కోచ్‌లను భారత్‌కి పంపుతుంది. ఒప్పందం సందర్భంగా బ్లాక్‌ హాక్స్‌ యజమానికి అభిషేక్‌రెడ్డి కంకణాల మాట్లాడుతూ..‘‘ భారతదేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదని, మన దేశంలోని ఆసక్తిగల యువతను ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ హాక్స్‌ బ్రాండ్‌ను పెంచటం మాత్రమే కాకుండా భారతీయ వాలీబాల్ ఆటగాళ్లకు ప్రపంచ వేదికను అందించడంతో సహకరిస్తుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని