hyderabad VS gujarat : హైదరాబాద్‌ అభిమానులూ.. కాలర్‌ ఉన్న షర్టులు వేసుకోండమ్మా!

టీ20 లీగ్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఓడిన తర్వాత హైదరాబాద్‌ అద్భుతంగా పుంజుకుని ...

Published : 13 Apr 2022 01:27 IST

గుజరాత్‌పై ఘన విజయంతో మీమ్స్‌ సందడి

 

‘ఎవర్నీ తక్కువగా అంచనా వేయొద్దు’..

‘మే 29 వరకే మీరు హైదరాబాద్‌ ఆటగాళ్లు.. ఆ తర్వాత ఛాంపియన్స్’

‘తగ్గేదేలే’

‘హైదరాబాద్‌ అభిమానులు కాలర్‌ ఉన్న షర్టులు వేసుకోండమ్మా!.. ఎగరేసే టైమ్‌ వచ్చేసింది’

‘స్విగ్గీ ఫాస్టెస్ట్‌ బౌలర్‌ రివార్డును మ్యాచ్‌కు ముందే ఉమ్రాన్‌ కోసం పక్కన పెట్టేస్తే సరి.. మా టైమైనా సేవ్‌ అవుద్ది’

నా చేయి వీడవద్దు... నన్ను వదిలేసి పోవద్దు.. అంటూ చెన్నై, ముంబయి జట్ల మధ్య సరదా ముచ్చట్లు’

ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా... హైదరాబాద్ రెండో విజయం సాధించడంతో నెట్టింట్లో అభిమానులు సరదా మీమ్స్‌తో చెలరేగుతున్నారు. టీ20 లీగ్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఓడిపోవడంతో హైదరాబాద్‌ జట్టును చులకనగా చూసిన వారికి బుద్ధి చెప్పేలా అభిమానులు మీమ్స్‌ను రూపొందించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇదే ఉత్సాహాన్ని టోర్నీ ఆసాంతం కొనసాగించి ఛాంపియన్లుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. 

ఇంటర్నెట్‌ డెస్క్‌: హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ను నిన్న జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ చిత్తు చేసిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా రెండో విజయంతో హైదరాబాద్‌ నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్‌ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో 168 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో గుజరాత్‌కు తొలి ఓటమిని రుచి చూపించిన హైదరాబాద్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌ అభిమానులు విజయోత్సవాలకు సిద్ధంగా ఉండాలని మీమ్స్‌ను షేర్‌ చేస్తున్నారు. మరి అలాంటి సరదా మీమ్స్‌, పోస్టులేంటో మీరూ ఓ సారి చూసేయండి..
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని