Chris Gayle: నేను వదిలి వెళ్లడం లేదు.. : క్రిస్‌ గేల్‌

వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్‌గేల్‌ తన రిటైర్‌మెంట్‌ సంబంధించి తాజాగా ఓ కీలక ప్రకటన చేశాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా అడుగుపెట్టిన వెస్టిండీస్‌ పేలవమైన ఆటతీరుతో సెమీస్‌ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది.

Published : 20 Nov 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూనివర్సల్‌ బాస్, వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్‌గేల్‌ తన రిటైర్‌మెంట్‌ సంబంధించి తాజాగా ఓ కీలక ప్రకటన చేశాడు. గురువారం రాత్రి ట్విటర్‌లో అందుకు సంబంధించిన ఆసక్తికర పోస్టు పెట్టాడు. ‘నేను వదిలి వెళ్లడం లేదు’ అని ట్వీట్‌ చేశాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన చివరి మ్యాచ్‎లో బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చిన గేల్‌ను సహచరులు చప్పట్లతో అభినందించారు. అతడు ఔటయ్యాక మైదానానికి సెల్యూట్ చేస్తూ ప్రేక్షకుల వైపు గ్లోవ్స్ విసిరాడు‌. అనంతరం ఐసీసీ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. “నేను మరో ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నా. కానీ అనుమతిస్తారని నేను అనుకోను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఇప్పటికి నేను ఎలాంటి రిటైర్‌మెంట్‌ ప్రకటించలేదు. నిజానికి జమైకాలో ఒక గేమ్‌ ఆడాలనుకుంటున్నా. సొంత ప్రేక్షకుల మధ్య చివరి మ్యాచ్‌ ఆడి రిటైరవ్వాలనుకుంటున్నా’’ అని గేల్‌ చెప్పుకొచ్చాడు.

* మొత్తం79 టీ20లు, 103 టెస్టులు, 301 వన్డేలు ఆడిన గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లో 22 ఏళ్లుగా కొనసాగుతున్నాడు. అయితే ఇంతకుముందే టెస్టు క్రికెట్‎కు వీడ్కోలు పలికాడు. 

* 2012, 2016 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని