Mohammed Shami : నాకిష్టమైన ఫుడ్‌ దొరకడం లేదు.. కానీ : మహమ్మద్‌ షమీ

సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ(Mohammed Shami) అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఫాలో అవుతున్న డైట్‌ గురించి రవిశాస్త్రి అడిగాడు.

Published : 16 May 2023 15:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) మరో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)పై 34 పరుగుల తేడాతో గెలిచి.. ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీతో వీర విహారం చేయగా.. బంతితో షమీ(Mohammed Shami) నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌ అనంతరం ఎలాంటి డైట్‌ పాటిస్తావు అని కామెంటేటర్‌ రవి శాస్త్రి(Ravi Shastri) అడగ్గా.. దానికి షమీ సరదా సమాధానం ఇచ్చాడు.

రవిశాస్త్రి : నువ్వు ఇంకా స్ట్రాంగ్‌గా మారుతున్నావు. ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటావు..?నెలన్నర రోజులు గడిచిపోయాయి. ఎండలు కూడా మండుతున్నాయి. అయినా.. మరింత వేగంగా ఎలా పరుగెత్తుతున్నావు..?

షమీ : నేను గుజరాత్‌లో ఉన్నాను. నాకిష్టమైన ఫుడ్‌ ఇక్కడ దొరకడం లేదు. అయితే.. నేను గుజరాత్‌ వంటకాలను ఆస్వాదిస్తున్నాను

ఇక షమీ.. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన మరో సీనియర్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ‘నేను నా బలాలపై దృష్టి పెడతాను. ఎప్పుడూ గుడ్‌ ఏరియాస్‌లో బంతులు సంధించేందుకు ప్రయత్నిస్తా. మిడిల్‌ ఓవర్లలో మోహిత్‌ శర్మలాంటి పేసర్‌ ఉండటం జట్టుకు ఎంతో  కలిసివస్తోంది. అతడు తెలివిగా వైవిధ్యాన్ని జోడించి బంతులు వేస్తుంటాడు’ అని షమీ అన్నాడు.

ఇక ఇప్పటికే ప్లేఆఫ్స్‌లోకి చేరడంతో.. గుజరాత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. బెంగళూరు(RCB)తో ఈ నెల 21న గుజరాత్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని