
Gautham gambhir: కెప్టెన్సీ ఉన్నా.. లేకున్నా కోహ్లీలో మార్పు ఉండదు: గంభీర్
ముంబయి: కెప్టెన్సీ తొలగింపు విరాట్ కోహ్లీని ఏ మాత్రం బాధించదని.. భవిష్యత్తు మ్యాచుల్లో అతడు రెట్టింపు జోరు చూపిస్తాడని మాజీ భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. టీ20ల్లో కెప్టెన్‌గా తప్పుకొన్న విరాట్ వన్డేలపై దృష్టిసారించాలని భావించాడు. కానీ, బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. దీంతో విరాట్ నిరుత్సాహపడి ఉంటాడని, ఇకపై వన్డే మ్యాచుల్లో రాణించకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. గౌతమ్ గంభీర్ మాత్రం తాను అలా అనుకోవట్లేదని తెలిపాడు.
ఓ క్రీడాఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ ‘‘టెస్ట్ మ్యాచుల్లో అయినా, నిర్ణీత ఓవర్ల మ్యాచుల్లో అయినా విరాట్ కోహ్లీ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. కెప్టెన్‌గా ఉన్నా.. లేకున్నా కోహ్లీకి తన సుదీర్ఘ కెరీర్‌లో క్రికెట్‌పై ఉన్న ప్యాషన్.. ఎనర్జీ భవిష్యత్తు మ్యాచుల్లోనూ ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. భారత్ గర్వించే విధంగా ఏ ఫార్మాట్‌లో అయినా పరుగుల వరద పారిస్తాడు. అలాగే, ఇద్దరు భిన్నమైన వ్యక్తుల(విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మ) అభిప్రాయాలు, సూచనలు టీమిండియాకు లభిస్తాయి. కెప్టెన్సీ భారం లేకపోవడంతో విరాట్ కోహ్లీ మరింత విధ్వంసకర బ్యాటర్‌గా మారే అవకాశముంది’’అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.