Dinesh Karthik: సిరాజ్‌కి వన్డే ప్రపంచకప్‌లో చోటు పక్కా.. టెస్టుల్లో 300 వికెట్లు పడగొడ్తాడు: డీకే
భారత ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj)పై వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తిక్ ప్రశంసలు కురిపించాడు. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌నకు అతడు తప్పకుండా ఎంపిక అవుతాడని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) 2022లో బంతితో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ రాణించాడు. ఇటీవల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బౌలర్‌గా అవతరించాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌పై భారత వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ప్రశంసలు కురిపించాడు. ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు సిరాజ్ తప్పకుండా ఎంపికవుతాడని దినేశ్ కార్తిక్ ధీమా వ్యక్తం చేశాడు. సిరాజ్ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోగలిగితే టెస్టు క్రికెట్‌లో భారతదేశపు అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌లలో ఒకడిగా మారగలడని కార్తీక్ పేర్కొన్నాడు.
‘అతడు (సిరాజ్) 2023 వన్డే ప్రపంచకప్ జట్టులో భాగమవుతాడని నేను చాలా కచ్చితంగా చెప్తున్నా. అతడు ఆ స్థానానికి అర్హుడు. చాలా బాగా ఆడాడు. 2022 ఐపీఎల్‌లో రాణించలేదు. వైఫల్యాలను ఎలా ఎదుర్కొవాలనే విషయాలను అప్పుడు నేర్చుకున్నాడు. ఆ వైఫల్యం సిరాజ్‌ని మంచి స్థితికి చేర్చింది. గాయాల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలి. సదీర్ఘ పార్మాట్‌లో బాగా రాణిస్తున్నాడు. ఫిట్‌గా ఉంటే భారతదేశపు అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌లలో ఒకడిగా మారతాడు. టెస్టు క్రికెట్‌లో కనీసం 300 వికెట్లు పడగొట్టడం నేను చూస్తా. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సిరాజ్ ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాల్సింది’ అని దినేశ్ కార్తిక్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్‌లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..