Virat Kohli: కివీస్‌తో మూడో వన్డేలోనైనా విరాట్ రాణించాలి: వసీం జాఫర్
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి ప్రదర్శనపై భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: కివీస్‌తో జరగనున్న మూడో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాణిస్తాడని ఆశిస్తున్నట్లు భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ తెలిపాడు. విరాట్ కొంతకాలంగా లెగ్ స్పిన్‌ను ఎదుర్కోలేకపోతున్నాడని పేర్కొన్నాడు. కివీస్‌తో రెండు వన్డేల్లోనూ సాంట్నర్ వేసిన స్పిన్‌కు విరాట్ పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే.
‘‘ఈ సిరీస్‌లో విరాట్ ప్రదర్శన నిరాశపరిచింది. అతడు కొంతకాలంగా లెగ్ స్పిన్ ఎదుర్కోలేక పోతున్నాడు. కివీస్‌తో రెండు వన్డేల్లోనూ మిచెల్ సాంట్నర్ వేసిన స్పిన్‌కు ఔటయ్యాడు. మూడో వన్డేలోనైనా అతడు రాణించి మంచి స్కోరు సాధిస్తాడని ఆశిస్తున్నా. భారత్-ఆస్ట్రేలియా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ త్వరలోనే ప్రారంభమవనుంది. ఆసీస్ బౌలింగ్ విభాగం దృఢంగా ఉంది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆ జట్టులో ఉన్నాడు. అందువల్ల కోహ్లి తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలి. రెండో వన్డేలో భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మహమ్మద్ షమీ గొప్పగా రాణించాడు’’ అని జాఫర్ తెలిపాడు. కివీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-0 తో ఆధిక్యంలో ఉంది. భారత్-న్యూజిలాండ్ మధ్య ఆఖరి వన్డే జనవరి 24న ఇందోర్‌లో జరగనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Vijay Deverakonda: అవును ఇది నిజం.. ‘గీత గోవిందం’ కాంబినేషన్ రిపీట్!
-
Politics News
BRS: 20 మంది భారాస నాయకులపై బహిష్కరణ వేటు
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
Sports News
Pervez Musharraf - MS Dhoni: ‘నీ హెయిర్ స్టైల్ బాగుంది ధోనీ.. జుట్టు కత్తిరించుకోవద్దు’
-
General News
AP SI Posts: ఏపీలో ఎస్సై రాత పరీక్ష.. హాల్టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి