
Venkatesh Iyer: క్రికెట్లో ద్రవిడ్ సర్ ఓ లెజెండ్ : వెంకటేశ్ అయ్యర్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్రికెట్లో ఓ లెజెండ్ అని.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు. ద్రవిడ్ కోచింగ్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. బుధవారం (నవంబర్ 17) న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టీ20 మ్యాచ్ ద్వారా వెంకటేశ్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ‘క్రికెట్లో ద్రవిడ్ సర్ ఓ లెజెండ్. ఆయనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై మనమే ఓ నిర్ణయం తీసుకోవాలి. నేనైతే ఖాళీ మైండ్‌తో జట్టులోకి వచ్చాను. ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటాను’ అని వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు.
‘టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, కీపర్ రిషభ్ పంత్‌తో నేను మాట్లాడాను. టీమిండియాలోకి అరంగేట్రం చేస్తున్న నాకు వాళ్లంతా సాదర స్వాగతం పలికారు. రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్. బ్యాటింగ్‌కు సంబంధించి అతడి నుంచి పలు సలహాలు తీసుకున్నాను. జట్టులోని సీనియర్లతో మాట్లాడటం గొప్ప అనుభూతినిచ్చింది’ అని అయ్యర్ చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్.. న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News