Hardik Pandya: టీ20 ప్రపంచ కప్‌నకు పాండ్య అవసరం: షేన్‌ బాండ్‌

2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత వెన్నునొప్పి కారణంగా హార్దిక్‌ పాండ్య కొంత కాలం టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

Updated : 04 Jun 2022 10:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత వెన్నునొప్పి కారణంగా హార్దిక్‌ పాండ్య కొంత కాలం టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ ఆశించిన మేరకు రాణించలేదు. తర్వాత మళ్లీ క్రికెట్‌ మైదానంలో కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీ20 లీగ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు హార్దిక్‌. తొలి సీజన్‌లోనే జట్టును విజేతగా నిలిపి తన ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటాడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్‌ పాండ్యపై ముంబయి జట్టు బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ ప్రశంసలు కురిపించాడు. హార్దిక్‌ పాండ్య కూల్‌ కెప్టెన్‌ అని, అక్టోబర్‌లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో ఈ ఆల్‌రౌండర్‌ టీమ్‌ఇండియా తరఫున అద్భుతంగా రాణిస్తాడని షేన్‌ బాండ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

‘హార్దిక్ చాలా కూల్ కెప్టెన్. అతడు ముంబయి జట్టులో ఉన్నప్పుడు ఇద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం. హార్దిక్‌  వేరే ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వెళ్లాడు. బహుశా అతడికి ఆ బాధ్యత కొత్తది కావొచ్చు. అయినా, కెప్టెన్సీ బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. నేను అతడిని మిస్‌ అవుతున్నా. పాండ్య నాణ్యమైన ఆటగాడు.. కాబట్టి మా జట్టులో ఉంటే బాగుండేది. టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియాకు అతడు అవసరం. ఎందుకంటే, హార్దిక్‌ పాండ్య నాణ్యమైన ఆటగాడిగానే కాకుండా మంచి కెప్టెన్‌గానూ నిరూపించుకున్నాడు’ అని షేన్‌ బాండ్‌ వివరించాడు. జూన్‌ 9 నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్య ఎంపికయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని