wasim jaffer: షమీ కాదు.. ప్రపంచకప్‌నకు దీపకే సరైనోడు: వసీం

బుమ్రా స్థానంలో పేసర్‌ మహ్మద్‌ షమీకు అవకాశం ఇస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 07 Oct 2022 00:24 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియా కీలక ఆటగాడు జస్ప్రీత్‌ బుమ్రా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో పేసర్‌ మహ్మద్‌ షమీకు అవకాశం ఇస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీకి బదులుగా ప్రపంచ టోర్నీ జట్టులో పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ను తీసుకోవడమే సరైందని తెలిపాడు. 

అందుకు కారణాలను పేర్కొంటూ.. ‘‘నన్నడిగితే బుమ్రా స్థానాన్ని దీపక్‌ చాహర్‌తో భర్తీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అతడు మ్యాచులకు దూరంగా లేడు. రాబోయే వన్డేలోనూ ఆడనున్నాడు. బౌలింగ్‌ పరంగానే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. కొత్త బాల్‌తో ఆడినా తన వైవిధ్యం తనకుంటుంది. అతడు డెత్‌ ఓవర్లలోనూ మ్యాజిక్‌ చేయగల ఆటగాడు’’ అని తెలిపాడు. చాలా కాలంగా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని షమీని నేరుగా ప్రపంచకప్‌లో భాగం చేయడం అన్యాయమే అవుతుందన్నాడు. సిరీస్‌కు ముందు ఆడే రెండు ప్రాక్టీస్‌ మ్యాచుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో దీపక్‌ ఆకట్టుకున్నాడు. 17 బంతుల్లో 31 పరుగులు చేసి, 2ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts