WPL : ఓటములకు నాదే బాధ్యత : ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన

ఆడేవారందరూ స్టార్‌ ప్లేయర్లే.. అయినప్పటికీ ఆ జట్టు వరుస ఓటములతో ఢీలా పడుతోంది. WPLలో RCB జట్టు ఇప్పటి వరకూ బోణీ కొట్టలేదు.

Published : 11 Mar 2023 19:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డబ్ల్యూపీఎల్‌(WPL)లో వరుస ఓటములతో ఆర్సీబీ(RCB) జట్టు తీవ్ర నిరాశ పరుస్తోంది. స్టార్‌ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ ఈ జట్టు బోణీ కొట్టలేకపోయింది. శుక్రవారం యూపీ వారియర్స్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది స్మృతి మంధాన(Smriti Mandhana) జట్టు. ఈ ఓటములపై  స్మృతి స్పందిస్తూ.. దీనికి తనదే బాధ్యత అంటూ పేర్కొంది.

‘గత నాలుగు మ్యాచ్‌ల్లో మేం బాగానే ప్రారంభిస్తున్నప్పటికీ.. వికెట్లను వెంటవెంటనే కోల్పోతున్నాం. ఓటములకు బాధ్యత నేనే తీసుకుంటా. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా స్కోరు బోర్డుపై పరుగులు ఉంచాలి. అప్పుడే బౌలర్లకు పోరాడేందుకు వీలుంటుంది’ అని మ్యాచ్‌ అనంతరం స్మృతి మాట్లాడుతూ పేర్కొంది.

ఇక ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన బెంగళూరు.. పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉంది. ఇక ఆడిన మూడింట్లో మూడు విజయాలతో ముంబయి జట్టు అగ్రస్థానంలో దూసుకుపోతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు