Yuvraj : టీమ్‌ఇండియా తరఫున వంద టెస్టులు ఆడాలని కోరుకున్నా.. కానీ: యువరాజ్‌

టీమ్ఇండియా రెండు ప్రపంచకప్‌లను గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో ధోనీ కాకుండా యువరాజ్‌ సింగ్‌ ముందుంటాడు. తెల్ల బంతి క్రికెట్‌లో...

Published : 08 May 2022 02:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియా రెండు ప్రపంచకప్‌లను గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో యువరాజ్‌ సింగ్‌ ఒకడు. తెల్ల బంతి క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు, తక్కువ బంతుల్లో అర్ధ శతకం.. ఇలా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే టెస్టు ఫార్మాట్‌కు వచ్చేసరికి పెద్దగా అవకాశాలూ రాలేదు. వచ్చినప్పుడు ఫర్వాలేదనిపించాడు. సచిన్‌, సెహ్వాగ్‌, ద్రవిడ్, లక్ష్మణ్‌, గంగూలీ వంటి హేమాహేమీలు ఉన్న సమయంలో యువరాజ్‌ అడపాదడపా జట్టులోకి వచ్చేవాడు. అయితే టీమ్‌ఇండియా తరఫున వంద టెస్టులను ఆడాలనే కోరిక తనకుండేదని మనసులోని మాటను యువరాజ్‌ బయటపెట్టాడు. టెస్టు క్రికెట్‌ ఎక్కువగా ఆడలేకపోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాడు.  

‘‘దిగ్గజ క్రికెటర్లు ఉన్న సమయంలో తక్కువ అవకాశాలు వచ్చేవి. అయితే సౌరభ్ గంగూలీ రిటైర్‌మెంట్ ప్రకటించాక టెస్టు క్రికెట్‌ అడే ఛాన్స్‌ వచ్చింది. కానీ అదే సమయంలో నేను క్యాన్సర్‌ బారిన పడ్డా. ఇది కేవలం నా దురదృష్టం. 24x7 ప్రయత్నించా. భారత్‌ తరఫున వంద టెస్టులు ఆడాలని బలంగా కోరుకున్నా. రెండురోజులపాటు బ్యాటింగ్‌ చేయడం, ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవడం వంటిపై శ్రమించా. అయితే అవేవీ సరిపోలేదు’’అని యువీ వివరించాడు. కేవలం 40 టెస్టులను మాత్రమే ఆడిన యువరాజ్‌ 1900 పరుగులను సాధించాడు. ఇందులో మూడు శతకాలు, 11 అర్ధశతకాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు