Published : 27 Jul 2021 01:44 IST

Tokyo Olympics: నా ఓటమికి ఒత్తిడే కారణం: మనిక బత్రా

టోక్యో: కచ్చితంగా పతకం సాధిస్తుందనే భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనిక బత్రా మూడో రౌండ్లో వెనుదిరిగింది. మహిళల సింగిల్స్‌లో ఆస్ట్రియా ప్లేయర్‌ పొల్కనోవా సోఫియా చేతిలో 0-4 తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ ఓటమికి ఒత్తిడే కారణమని మ్యాచ్‌ అనంతరం మనిక తెలిపింది. మూడో రౌండ్‌ గురించి అతిగా ఆలోచించానని.. ఆ ఒత్తిడి పెరిగిపోయి ఓటమిపాలైనట్లు పేర్కొంది. ‘నేను ఈ రౌండ్‌ గెలవాల్సింది. నా మీద నేను భారీ అంచనాలను పెట్టుకున్నా. దీంతో కొంచెం నర్వస్‌గా ఫీలయ్యా. క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి వెళ్లేందుకు ఈ రౌండ్‌ గెలవాల్సింది’ అని భావోద్వేగానికి గురైంది.

కొవిడ్‌ కారణంగా మ్యాచ్‌ వద్దకు కొందరు కోచ్‌లను అనుమతించలేదు. దీనిపై మనిక మాట్లాడుతూ.. తనకు సపోర్ట్‌గా కోచ్‌లు లేరని, అవసరమైనప్పుడు తనకు మద్దతు లభించలేదని వాపోయింది. ‘ఒలింపిక్స్‌ లాంటి అత్యున్నత క్రీడా పోటీల్లో అథ్లెట్‌కు సలహాలు ఇచ్చేందుకు, మానసికంగా మద్దతు తెలిపేందుకు కోచ్‌ల సాయం కావాలి. నా ప్రత్యర్థికి మద్దతుగా ఆమె కోచ్‌ వెంటే ఉన్నారు. కానీ నా వెంట కోచ్‌లు లేరు. వాళ్లు ఉంటే బాగుండేది’ అని పేర్కొంది. ఓటమికి కుంగిపోనని, ఇప్పుడు చేసిన తప్పిదాలను నోట్‌ చేసుకొని వాటిని అధిగమిస్తానని తెలిపింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts