WTC Final: అందుకు  సిద్ధంగా ఉంటా: అవేశ్‌ఖాన్

ఈ ఐపీఎల్ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించి ఎనిమిది మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు యువ పేసర్‌ అవేశ్‌ఖాన్‌.  ఈ ప్రదర్శనతో  సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన అతనికి మంచి అవకాశం దక్కింది.  జూన్‌ 18-22 మధ్య

Updated : 10 May 2021 20:24 IST

 

 


ఇంటర్నెట్ డెస్క్‌:  ఈ ఐపీఎల్ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించి ఎనిమిది మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు యువ పేసర్‌ అవేశ్‌ఖాన్‌.  ఈ ప్రదర్శనతో  సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన అతనికి మంచి అవకాశం దక్కింది.  జూన్‌ 18-22 మధ్య  సౌథాంప్టన్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌, ఆపై  ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు అవేశ్‌ఖాన్‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్జాన్‌ నాగ్వాస్‌వాలా  స్టాండ్ బై బౌలర్లుగా ఎంపికయ్యారు.

ఈ పర్యటనలో తుది జట్టులో ఆడే అవకాశం వస్తే తన శక్తిమేరకు కృషి చేసి మంచి ప్రదర్శన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటానని అవేశ్‌ఖాన్‌ పేర్కొన్నాడు.‘నేను  నెట్ బౌలర్‌గా టీమిండియాతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లాను. ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 ప్రపంచకప్‌ సమయంలోనూ జట్టుతో ఉన్నా. ఆసియా కప్‌, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కూడా టీమిండియాతోనే ఉన్నా.  ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో స్టాండ్ బై బౌలర్‌గా నాకు మంచి అవకాశం వచ్చింది.  ఒకవేళ జట్టులో ఎవరైనా గాయపడితే  తుది జట్టులో చోటు దక్కొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కసరత్తులు మొదలుపెడతా.  తుది జట్టులో చోటు దక్కితే శక్తిమేరకు కృషి చేసి మంచి ప్రదర్శన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటా’నని అవేశ్‌ఖాన్‌ అన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు