కోహ్లీ 1+.. రాహుల్‌ 1-

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి టాప్‌-5లో ప్రవేశించాడు. ఇంగ్లాండ్‌పై వరుసగా రెండు అర్ధశతకాలు సాధించిన అతడు ఒకస్థానం ఎగబాకి ఐదో ర్యాంకులో నిలిచాడు. రెండు మ్యాచుల్లోనూ 73, 77తో అజేయంగా నిలవడంతో 47 రేటింగ్‌ పాయింట్లు మెరుగు పర్చుకున్నాడు....

Published : 17 Mar 2021 16:12 IST

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ టాప్‌-5లోకి విరాట్‌

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి టాప్‌-5లో ప్రవేశించాడు. ఇంగ్లాండ్‌పై వరుసగా రెండు అర్ధశతకాలు సాధించిన అతడు ఒకస్థానం ఎగబాకి ఐదో ర్యాంకులో నిలిచాడు. రెండు మ్యాచుల్లోనూ 73, 77తో అజేయంగా నిలవడంతో 47 రేటింగ్‌ పాయింట్లు మెరుగు పర్చుకున్నాడు. ఈ మేరకు ఐసీసీ ట్వీట్‌ చేసింది.

ఇక మూడు టీ20ల్లోనూ విఫలమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 771 రేటింగ్‌ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఒక ర్యాంకు దిగజారాడు. మూడో టీ20లో 83 పరుగులతో అజేయంగా నిలిచిన జోస్‌ బట్లర్‌ ఐదు స్థానాలు మెరుగై  19వ ర్యాంకు అందుకున్నాడు. జానీ బెయిర్‌స్టో 2 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకులో నిలిచాడు. టీమ్‌ఇండియాపై విధ్వంసకర ప్రదర్శనలేమీ లేకున్నా డేవిడ్‌ మలన్‌ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.

టీమ్‌ఇండియాలో శ్రేయస్‌ అయ్యర్‌ 32 ర్యాంకులు ఎగబాకి 31కి, రిషభ్‌ పంత్‌ 30 ర్యాంకులు మెరుగై 80కి చేరుకున్నారు. బౌలింగ్‌ విభాగంలో వాషింగ్టన్‌ సుందర్‌ 2 స్థానాలు ఎగబాకి 11, శార్దూల్‌ ఠాకూర్‌ 14 స్థానాలు మెరుగై 27కు, భువనేశ్వర్‌ 7 స్థానాలు ఎగబాకి 45కు చేరుకున్నారు. బ్యాటింగ్‌ విభాగంలో కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ మినహా మరెవ్వరూ టాప్‌-10లో లేరు. బౌలింగ్‌, ఆల్‌రౌండర్‌ విభాగంలోనూ భారత్‌ నుంచి టాప్‌-10 ఎవరికీ చోటు దక్కలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని