ICC: క్రికెట్టే క్రికెట్టు.. కప్పులే కప్పులు

క్రికెట్‌ అభిమానులకు 2031 వరకు పండగే. కావాల్సినంత వినోదం. విశ్వవేదికలపై జట్లు మరిన్నిసార్లు పోటీపడనున్నాయి. ఐసీసీ నిర్వహించే ప్రపంచ పోటీల సంఖ్య గణనీయంగా...

Updated : 17 Nov 2021 08:22 IST

ఎనిమిదిలో మూడుభారత్‌లో
2024 నుంచి 2031 వరకు ఏడాదికో ఐసీసీ టోర్నీ

దుబాయ్‌: క్రికెట్‌ అభిమానులకు 2031 వరకు పండగే. కావాల్సినంత వినోదం. విశ్వవేదికలపై జట్లు మరిన్నిసార్లు పోటీపడనున్నాయి. ఐసీసీ నిర్వహించే ప్రపంచ పోటీల సంఖ్య గణనీయంగా పెరగనుంది. 2024 నుంచి 2031 వరకు ఏడాదికో టోర్నీ జరగనుంది. ఈ కాలానికి ఐసీసీ ప్రకటించిన ఐసీసీ టోర్నమెంట్ల షెడ్యూలులో నాలుగు టీ20 ప్రపంచకప్‌లు, రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు ఛాంపియన్స్‌ ట్రోఫీలు ఉన్నాయి. మొత్తం 14 దేశాలకు ఐసీసీ ఆతిథ్య హక్కులను కట్టబెట్టింది. భారత్‌కు మూడు టోర్నీల ఆతిథ్య హక్కులు దక్కగా.. పాకిస్థాన్‌కు రెండు దశాబ్దాల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌ (2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ)ను నిర్వహించే అవకాశం లభించింది.   పాకిస్థాన్‌ చివరగా 1996 (ప్రపంచకప్‌)లో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి తర్వాత ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ పెద్దగా   జరగలేదు. 2024 టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ఆతిథ్యమివ్వనుంది. అమెరికా, నమీబియా తొలిసారి ప్రపంచకప్‌ను నిర్వహించనున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో కలిసి నమీబియా ఆతిథ్యం ఇవ్వనుంది.  


2024
టోర్నీ: టీ20 ప్రపంచకప్‌
ఆతిథ్య దేశాలు: వెస్టిండీస్‌, అమెరికా


2025

టోర్నీ: ఛాంపియన్స్‌ ట్రోఫీ
ఆతిథ్య దేశం:పాకిస్థాన్‌


2026

టోర్నీ: టీ20 ప్రపంచకప్‌
ఆతిథ్య దేశాలు: భారత్‌, శ్రీలంక


2027

టోర్నీ: వన్డే ప్రపంచకప్‌
ఆతిథ్య దేశాలు: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా


2028

టోర్నీ: టీ20 ప్రపంచకప్‌
ఆతిథ్య దేశాలు:ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌


2029

టోర్నీ: ఛాంపియన్స్‌ ట్రోఫీ
ఆతిథ్య దేశం: భారత్‌


2030

టోర్నీ: టీ20 ప్రపంచకప్‌
ఆతిథ్య దేశాలు:ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌


2031

టోర్నీ: వన్డే ప్రపంచకప్‌
ఆతిథ్య దేశాలు:భారత్‌, బంగ్లాదేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని