ఐసీసీ మహిళల క్రికెట్లో కొత్త అడుగు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఐసీసీ మహిళల క్రికెట్‌కు సంబంధించి కొత్త అడుగు ముందుకేసింది. 2026 నుంచి జరిగే ఐసీసీ మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో మరిన్ని...
దుబాయ్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఐసీసీ మహిళల క్రికెట్‌కు సంబంధించి కొత్త అడుగు ముందుకేసింది. 2026 నుంచి జరిగే ఐసీసీ మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో మరిన్ని జట్లను చేర్చనున్నట్లు చెప్పింది. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో పది జట్లు ఆడుతుండగా, 2026 నుంచి 12 జట్లు పోటీపడతాయని తెలిపింది. అలాగే వన్డే ఫార్మాట్లో ఎనిమిది జట్లకు బదులు పది జట్లు ఆడతాయని వివరించింది.
ఇక రాబోయే వన్డే ప్రపంచకప్‌తో పాటు, 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ ఇప్పుడున్న జట్లే పోటీపడతాయని ఐసీసీ స్పష్టం చేసింది. మహిళల క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి గత నాలుగేళ్లుగా కృషి చేస్తున్నామని, అలాగే ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు చేరువ చేయడానికి బ్రాడ్కాస్టర్లతో పెట్టుబడులు పెడుతున్నామని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనుసాహ్నే చెప్పారు. గతేడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌కు విశేష ఆదరణ లభించిందని.. రికార్డు స్థాయిలో 1.1 బిలియన్ల మంది ఆన్లైన్లో ఆ టోర్నీని వీక్షించారన్నారు. కాగా, నేరుగా స్టేడియానికి వచ్చి వీక్షించిన వారి సంఖ్య 86,174గా నమోదైంది. దీన్ని బట్టి మహిళ క్రికెట్‌కు ఆదరణ లభిస్తోందని మను పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్‌రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్‌కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్‌కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్‌కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్‌ను తప్పించాల్సిందే
ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్‌ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
-
ప్రవీణ్‌ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
-
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్
-
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!