ICC Rankings: బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఇషాన్ కిషన్‌.. టాప్‌లో జో రూట్‌

ఐసీసీ బుధవారం టెస్టు, వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న ఇషాన్‌ కిషన్‌ ఏకంగా 68 స్థానాలు ఎగబాకి టాప్‌-10లోకి బుల్లెట్‌లా దూసుకొచ్చాడు. అతడు ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు.

Published : 15 Jun 2022 19:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐసీసీ బుధవారం టెస్టు, వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న ఇషాన్‌ కిషన్‌ ఏకంగా 68 స్థానాలు ఎగబాకి టాప్‌-10లోకి బుల్లెట్‌లా దూసుకొచ్చాడు. అతడు ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు. టాప్‌-10లో భారత్‌ నుంచి అతనొక్కడికే చోటు దక్కడం విశేషం. గత కొంత కాలంగా ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ సూఫర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో రూట్‌ ఇప్పటికే నాలుగు శతకాలు బాదాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో ఇంగ్లాండ్‌ తరఫున 10 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం జో రూట్‌ (897 పాయింట్లు) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్ లబుషేన్‌ (892 పాయింట్లు)ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

రోహిత్‌ శర్మ 754 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 742 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌ విభాగంలో ప్యాట్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల కేటగిరీలో రవీంద్ర జడేజా టాప్‌లో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. వన్డే ర్యాకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో బాబర్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌ విభాగంలో బుమ్రా ఒక్కడే టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని