ICC Rankings: విరాట్‌ కోహ్లీ రికార్డును సమం చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్‌

ఆస్ట్రేలియా క్రికెటర్‌ మార్నస్ లాబుషేన్‌ ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓ డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలు బాదాడు. ఈ క్రమంలోనే ఐసీసీ ఆల్‌టైమ్‌ టెస్టు మ్యాచ్‌ రేటింగ్స్‌లో తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లు అందుకుని కోహ్లీ రికార్డును సమం చేశాడు. 

Published : 14 Dec 2022 19:05 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెటర్‌ మార్నస్ లాబుషేన్‌ (Marnus Labuschagne) టెస్టుల్లో తన జోరును కొనసాగిస్తున్నాడు. అతడు ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఓ డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలు బాది సిరీస్‌ను ఆస్ట్రేలియా (Australia) 2-0 తేడాతో గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఐసీసీ ఆల్‌టైమ్‌ టెస్టు మ్యాచ్‌ రేటింగ్స్‌లో తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లు (937) అందుకున్నాడు లబుషేన్‌. 2018లో భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మంచి ఫామ్‌లో ఉండి 937 రేటింగ్‌ పాయింట్లు అందుకున్నాడు. దీంతో ఆల్‌టైమ్‌ టెస్టు రేటింగ్స్‌లో కోహ్లీని లబుసేన్‌ సమం చేసినట్లయింది. ఈ రేటింగ్స్‌లో ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వారిలో స్టీవ్‌ స్మిత్‌ ((947) పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగతున్నాడు. 937 పాయింట్లతో కోహ్లీ, లబుషేన్‌ రెండో స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ బ్యాటర్‌ జో రూట్‌ (923) పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.  

ఇటీవల వెస్టిండీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో లబుషేన్‌ (204; 350 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్‌) డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో (104; 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో (163) మరోసారి భారీ శతకం బాదాడు. ఈ సిరీస్‌ విజయం టెస్టు ఛాంపియన్‌ షిప్‌ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తిరుగులేని జట్టుగా నిలిచింది. ఆసీస్‌ (75%) విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా (60%), శ్రీలంక (53.33%), భారత్‌ (52.08%) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని