Womens World Cup : అన్ని మ్యాచ్‌లకూ డీఆర్‌ఎస్‌ విధానం: ఐసీసీ

శుక్రవారం (మార్చి 4) నుంచి ప్రారంభమయ్యే మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ...

Published : 03 Mar 2022 22:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శుక్రవారం (మార్చి 4) నుంచి ప్రారంభమయ్యే మహిళల వన్డే ప్రపంచకప్‌నకు న్యూజిలాండ్‌ సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ సహా మొత్తం ఎనిమిది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ వన్డే ప్రపంచకప్‌లో నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌)ని వినియోగిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. తొలిసారిగా 2017 మహిళల వరల్డ్ కప్‌లో డీఆర్‌ఎస్‌ను ఐసీసీ ప్రవేశపెట్టింది.

‘‘ఈసారి మహిళల ప్రపంచకప్‌ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఐసీసీ టీవీ నుంచి హక్కులను సొంతం చేసుకున్నవారందరూ లైవ్‌ ఇస్తారు. ఆరు మైదానాల్లో కనీసం 24 కెమెరాలతో మ్యాచ్‌లను ప్రేక్షకుల కోసం ప్రసారం చేస్తాం. అలానే ఈసారి కూడా డీఆర్‌ఎస్‌ని వినియోగిస్తున్నాం’’ అని ఐసీసీ వెల్లడించింది. టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో మార్చి 6న పాకిస్థాన్‌తో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని