ICC Rankings: ఏకంగా 108 స్థానాలు ఎగబాకిన దినేశ్ కార్తీక్‌.. టాప్‌ 10లో ఇషాన్‌ కిషన్‌

చాలా కాలం తర్వాత టీమ్‌ఇండియాకు ఎంపికైన వెటరన్‌ బ్యాటర్ దినేశ్‌ కార్తీక్ దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటాడు. ఇన్నింగ్స్‌ చివర్లో తనదైన శైలిలో చెలరేగి జట్టు మంచి స్కోర్లు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

Published : 23 Jun 2022 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్: చాలా కాలం తర్వాత టీమ్‌ఇండియాకు ఎంపికైన వెటరన్‌ బ్యాటర్ దినేశ్‌ కార్తీక్ దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటాడు. ఇన్నింగ్స్‌ చివర్లో తనదైన శైలిలో చెలరేగి జట్టు మంచి స్కోర్లు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ దూకుడైన ప్రదర్శనలతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దినేశ్‌ కార్తీక్ ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87 స్థానానికి చేరుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలతో అలరించిన ఇషాన్‌ కిషన్ ఒక స్థానం మెరుగుపర్చుకుని 6 స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌ బ్యాటర్లు బాబర్ అజామ్, మహ్మద్‌ రిజ్వాన్‌ వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో యుజువేంద్ర చాహల్ మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో ఉండగా.. ఆసీస్ ఫాస్ట్‌బౌలర్‌ జోస్‌ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్టుల్లో ఆల్‌రౌండర్ల విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ కెప్టెన్‌ షకీబ్‌ హల్‌ హసన్‌, టీమ్‌ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బ్యాటింగ్‌ విభాగంలో విరాట్ కోహ్లీ పదో స్థానంలో కొనసాగుతుండగా.. బౌలర్ల విభాగంలో అశ్విన్‌ రెండు, జస్ప్రీత్‌ బుమ్రా మూడో స్థానంలో ఉన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని