ICC T20I Team 2022: అత్యుత్తమ టీ20 జట్టుని ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ముగ్గురి ఎంపిక
2022 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ (ICC) తమ అత్యుత్తమ టీ20 జట్టుని సోమవారం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: 2022 సంవత్సరానికి సంబంధించి తమ అత్యుత్తమ టీ20 జట్టుని ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇందులో ముగ్గురు టీమ్‌ఇండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఈ జాబితాలో ఉన్నారు. గతేడాది టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుని 11 మంది ఆటగాళ్లతో ఐసీసీ జట్టుని ప్రకటించింది.
ఐసీసీ టీ20 జట్టు 2022:
జోస్ బట్లర్ (కెప్టెన్, ఇంగ్లాండ్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), విరాట్ కోహ్లీ (భారత్) , సూర్యకుమార్ యాదవ్ (భారత్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్, సికిందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్య (భారత్), సామ్ కరన్ (ఇంగ్లాండ్), వానిందు హసరంగ (శ్రీలంక), హారిస్ రవూఫ్ (పాకిస్థాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్).
మహిళల క్రికెట్‌కు సంబంధించిన టీ20 జట్టుని కూడా ఐసీసీ ప్రకటించింది. దీంట్లో టీమ్‌ఇండియా నుంచి స్మృతి మంధాన, దీప్తి శర్మ, రిచా ఘోష్‌లకు చోటు దక్కింది.
మహిళల టీ20 జట్టు ఇదే
సోఫీ డివైన్ (కెప్టెన్,న్యూజిలాండ్),స్మృతి మంధాన (భారత్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), యాష్ గార్డనర్ (ఆస్ట్రేలియా), తహిలా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దార్ (పాకిస్థాన్), దీప్తి శర్మ (భారత్), రిచా ఘోష్ (భారత్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్), ఇనోకా రణవీర (శ్రీలంక).
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Culture Festival : ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో ముఖ్యం : జైశంకర్
-
Nara Lokesh: 2 రోజులుకే ఆ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయ్: నారా లోకేశ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
బావిలో పైపులు.. బాధలకు తార్కాణాలు!
-
‘Bharat Dal’ brand: రాయితీపై శనగపప్పు.. ‘భారత్ దాల్’ కిలో రూ.60కే..
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు