INDW vs NZW: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

Updated : 10 Mar 2022 06:14 IST

హమిల్టన్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ జట్టును చిత్తు చేసి విజయంతో టోర్నీని ప్రారంభించిన మిథాలీ సేనకు తన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ రూపంలో కఠిన సవాలు ఎదురైంది. ప్రపంచకప్‌కు ముందు ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ను 4-1 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్‌తో జరిగిన పోరులో మ్యాచ్‌లో భారత్‌ 114 పరుగులకే కీలక 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినప్పటికీ ప్రత్యర్థి ఎదుట 244 పరుగులు చేసింది. అనంతరం పాక్‌ను 137 పరుగులకే ఆలౌట్‌చేసింది. దీంతో భారత్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. 

భారత జట్టు: స్మృతి మంధాన, యాస్తికా భాటియా,  దీప్తి శర్మ, మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌, రిచా ఘోష్‌(కీపర్‌), స్నేహ్‌ రాణా, పూజ వస్త్రాకర్‌, జులన్‌ గోస్వామి,  మేఘన సింగ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని