Virat Kohli: ఆ నలుగురు ఉండగా ఒత్తిడేలా?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో విరాట్‌ కోహ్లీపై ఒత్తిడేమీ ఉండదని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అక్షర్ పటేల్‌ అన్నాడు. జట్టులో అనుభవజ్ఞులైన రోహిత్‌ శర్మ, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె వంటి...

Published : 31 May 2021 11:22 IST

కుర్రాళ్లు ఆడగలరన్న అక్షర్‌ పటేల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో విరాట్‌ కోహ్లీపై ఒత్తిడేమీ ఉండదని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అక్షర్ పటేల్‌ అన్నాడు. జట్టులో అనుభవజ్ఞులైన రోహిత్‌ శర్మ, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె వంటి సీనియర్లు ఉన్నారని తెలిపాడు. ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా భావిస్తున్న రిషభ్‌ పంత్‌ సైతం ఉన్నాడని వెల్లడించాడు. విరాట్‌ లేనప్పటికీ ఆసీస్‌ సిరీసులో కుర్రాళ్లు అదరగొట్టారని గుర్తుచేశాడు.

‘విరాట్‌ కోహ్లీ ఒక్కడిపైనే ఒత్తిడి ఉండదు. జట్టులో సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా కుర్రాళ్లు ఫామ్‌లో ఉన్నారు. విరాట్‌ లేకుండానే మన జట్టు ఆసీస్‌పై టెస్టు సిరీస్‌ నెగ్గింది. ఇంగ్లాండ్‌ సిరీసులో అతడు త్వరగా ఔటైనా పంత్‌, సుందర్ అదరగొట్టారు. రోహిత్‌ శతకాలు బాదేశాడు. స్పిన్నర్లు సైతం లోయర్‌ ఆర్డర్లో బ్యాటింగ్ చేశారు’ అని అక్షర్‌ పటేల్‌ అన్నాడు.

‘ఆస్ట్రేలియాలో శార్దూల్‌ ఠాకూర్‌, సుందర్‌ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు 400-500 వంటి భారీ స్కోర్లు ఛేదించాల్సిన అవసరం రాదు. స్కోర్లు 300 లేదా 250 వరకే ఉంటాయి. అందుకే లోయర్‌ ఆర్డర్‌ భాగస్వామ్యాలు చాలా అవసరం. పుజారా, కోహ్లీ, రోహిత్‌, రహానె, పంత్‌ టాప్‌ ఆర్డర్లో ఉన్నారు. ఆ ఐదుగురిలో ఏ ఇద్దరు త్వరగా ఔటైనా మిగతా వాళ్లు పని పూర్తి చేయగలరు. భారత జట్టుకు ఆ సత్తా ఉంది. ఏ ఒక్కరి మీదో ఆధారపడదు. ఓపెనర్లు కాకుండా మిడిలార్డర్‌ లేదంటే లోయర్‌ ఆర్డర్‌ ఫలితాలను రాబట్టగలరు’ అని అక్షర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని