Virat Kohli: విరాట్‌కు 23 టెస్టుల నుంచి సెంచరీ లేదు.. ఐస్‌ల్యాండ్ క్రికెట్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్
టీమ్‌ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల కాలంలో వరుసపెట్టి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. కానీ, టెస్టుల్లో మాత్రం సెంచరీ కోసం నిరీక్షణ తప్పడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవలే 25వేల పరుగులు సాధించాడు. అత్యంత తక్కువ మ్యాచుల్లోనే ఇలాంటి ఘనత సాధించిన బ్యాటర్‌గా మారాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. అదీనూ టీ20ల్లో కావడం విశేషం. ఇటీవల వన్డేలోనూ శతక నిరీక్షణకు తెరదించాడు. కానీ, టెస్టుల్లో మాత్రం సెంచరీ సాధించి మూడున్నరేళ్లు అవుతోంది. చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్‌పై సెంచరీ సాధించాడు. దాదాపు 23 టెస్టుల నుంచి ఒక్క శతకం నమోదు కాలేదు. దక్షిణాఫ్రికాపై చేసిన 79 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. తాజాగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ 44, 20, 12 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి ఐస్‌ల్యాండ్ క్రికెట్ పెట్టిన ఓ ట్వీట్ మాత్రం ట్వీట్ వైరల్‌గా మారింది. విరాట్ అభిమానులకు మాత్రం రుచించడం లేదు. ఇంతకీ ఏమైందంటే..?
విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌లో సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లవుతోంది. ఈ క్రమంలో ఐస్‌ల్యాండ్ క్రికెట్ ‘‘విరాట్ కోహ్లీ గురించి ఇప్పుడు చెప్పే గణాంకాలు చాలామంది భారత అభిమానులకు నచ్చకపోవచ్చు. అయితే, విరాట్ కోహ్లీ సుదీర్ఘఫార్మాట్‌లో సెంచరీ సాధించి 23 టెస్టులు అయ్యాయి. చివరిసారిగా 2019లో సాధించాడు. ఇది చాలా సుదీర్ఘ కాలం..’’ అని ట్వీట్ చేసింది. దీంతో విరాట్ అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా పలు కామెంట్లు పెట్టారు.
‘‘అదేం కాదు. కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే. ఎందుకంటే 2020 నుంచి 2021 మధ్య వరకు కొవిడ్ కారణంగా పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. ఇప్పటి వరకు భారీగా సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ కనీసం మరో సంవత్సరం సమయం ఇవ్వాలి’’
‘‘విరాట్ ఒక్కో ఫార్మాట్‌లో ఫామ్‌ను అందిపుచ్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో సెంచరీలు బాదాడు. స్పిన్ కీలక పాత్ర పోషించిన టెస్టుల్లోనూ 44 (83), 21 (30) నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించాడు’’
‘‘కేవలం సెంచరీలు చేసినంత మాత్రనా ఆటగాడిని అత్యుత్తమ బ్యాటర్‌గా పరిగణించలేం. స్థిరంగా పరుగులు రాబట్టాలి. శతకం చేయకపోయినా, మ్యాచ్‌లో అతడి చేసిన రన్స్ కీలకమైతే చాలు. కోహ్లీ గత కొన్ని మ్యాచుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు’’
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముంది?
-
Amazon Festival Sale: అమెజాన్ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..
-
Social Look: లండన్‌లో అల్లు అర్జున్.. చెమటోడ్చిన ఐశ్వర్య.. సెట్లో రష్మి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/09/2023)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..