Gautam Gambhir: ఇప్పుడే చెప్పలేను

భారత పురుషుల క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌గా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ రాబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పదవి కోసం ఇప్పటికే అతని ఇంటర్వ్యూ కూడా పూర్తయింది.

Published : 22 Jun 2024 04:40 IST

కోచ్‌ పదవిపై  గంభీర్‌

కోల్‌కతా: భారత పురుషుల క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌గా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ రాబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పదవి కోసం ఇప్పటికే అతని ఇంటర్వ్యూ కూడా పూర్తయింది. అందరూ అతనే కోచ్‌ అంటున్నారు. కానీ గంభీర్‌ మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేనని పేర్కొన్నాడు. శుక్రవారం జరిగిన ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యక్రమంలో గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే అంత దూరం ఆలోచించడం లేదు. మీరు నన్ను కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడే దీని (కోచ్‌ పదవి)పై సమాధానం చెప్పడం కష్టం. అద్భుతమైన ప్రయాణాన్ని ముగించుకుని ఇప్పుడు ఆనందంగా ఉన్నా’’ అని తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెంటార్‌గా ఆ జట్టు టైటిల్‌ గెలవడంలో గంభీర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వ్యక్తుల కంటే కూడా జట్టుకు ప్రాధాన్యతనివ్వడమే తన వ్యక్తిత్వమని గంభీర్‌ అన్నాడు. ‘‘వ్యక్తుల కంటే కూడా జట్టును ముందుంచాలనే ఆలోచనతో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరైన ఫలితాలు వస్తాయి. ఒక్కొక్క ఆటగాడి గురించి కాకుండా జట్టుగా కేకేఆర్‌ను గెలిపించడమే మెంటార్‌గా నా బాధ్యత. అన్నింటికంటే జట్టే ముందు అనేది ఓ గురువుగా నా తత్వం. జట్టులోని 11 మంది ఆటగాళ్లనూ ఒకేలా చూడాలి. అందరికీ సమానంగా గౌరవం, బాధ్యతలు ఇవ్వాలి. అప్పుడే అద్భుతమైన విజయాలు అందుకోగలం’’ అని అతను చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు