టాస్‌ ఓడితే ఇంగ్లాండ్‌ పని అంతే..!

రెండో టెస్టులో టీమ్‌ఇండియా పుంజుకొనే అవకాశం ఉందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ నాసర్‌ హుస్సేన్‌ అన్నాడు. విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో జాగ్రత్తగా ఉండాలని రూట్‌ సేనకు సూచించాడు. టాస్‌ ఓడితే రెండో టెస్టులో ఇంగ్లిష్‌ జట్టు గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో కోహ్లీసేన...

Published : 11 Feb 2021 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండో టెస్టులో టీమ్‌ఇండియా పుంజుకొనే అవకాశం ఉందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ నాసర్‌ హుస్సేన్‌ అన్నాడు. విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో జాగ్రత్తగా ఉండాలని రూట్‌ సేనకు సూచించాడు. టాస్‌ ఓడితే రెండో టెస్టులో ఇంగ్లిష్‌ జట్టు గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో కోహ్లీసేన 277 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

‘టీమ్‌ఇండియా బలంగా పుంజుకుంటుందనే అంశాన్ని ఇంగ్లాండ్‌ దృష్టిలో పెట్టుకోవాలి. ఆస్ట్రేలియాలోనూ తొలి టెస్టులో భారత్‌ ఓడింది. 36 పరుగులకే ఆలౌటైనా తర్వాత బలంగా పుంజుకుంది. రెండో టెస్టులో టాస్‌ ఓడితే ఇంగ్లాండ్‌కు గెలుపు అవకాశాలు కష్టమవుతాయి. అయితే తొలి టెస్టులో గెలుపు కోసం కోహ్లీసేన సాధ్యమైనంతగా పోరాడింది’ అని హుస్సేన్‌ అన్నాడు.

భారత పర్యటనలో ఇంగ్లాండ్‌ 4-0తో క్లీన్‌స్వీప్‌ అవుతుందని చాలామంది రాశారని నాసర్ తెలిపాడు. పర్యాటక జట్టుకు అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదన్నాడు. భారత్‌ సైతం ఆట పరంగా గొప్పగా ఉందన్నాడు. ఆసీస్‌ గెలిచింది, విరాట్‌ తిరిగొచ్చాడు కాబట్టి అంతా అలాగే అంచనా వేశారని వివరించాడు.

‘ఈ విజయం ఇంగ్లాండ్‌ను సరైన స్థానంలో నిలబెట్టింది. వారు అత్యుత్తమంగా ఆడారు. తొలి బంతి నుంచి ఆఖరి వరకు పట్టుదలతో ఉన్నారు. ఇదే జోరును వారిప్పుడు కొనసాగించాలి. రూట్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌ దిగ్గజాల్లో ఒకడిగా మారతాడు. అందరి రికార్డులు బద్దలు కొడతాడు. అలిస్టర్‌ కుక్‌ 161 మ్యాచులు, పరుగులను దాటేస్తాడు. అతడి వయసు 30 ఏళ్లే. ఇంగ్లాండ్‌ ఆల్‌టైం గొప్ప ఆటగాళ్లను చూస్తే రూట్‌, కుక్‌, గ్రాహమ్‌ గూచ్‌, కెవిన్‌ పీటర్సన్‌ ఉంటారు’ అని హుస్సేన్‌ వెల్లడించాడు.

ఇవీ చదవండి
ఓటమిపై సాకులొద్దు.. పునఃసమీక్షించండి
రూట్‌ పైపైకి.. కోహ్లీ కిందకు..

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని