మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది‌: పంత్‌

ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్టు సిరీస్‌ విజయం సాధించడంలో వికెట్‌కీపర్ రిషభ్‌ పంత్ ప్రధాన పాత్ర పోషించాడు. నిర్ణయాత్మక చివరి టెస్టులో

Published : 26 Jan 2021 01:55 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్టు సిరీస్‌ విజయం సాధించడంలో వికెట్‌కీపర్ రిషభ్‌ పంత్ ప్రధాన పాత్ర పోషించాడు. నిర్ణయాత్మక చివరి టెస్టులో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అయితే సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో తాను మరో 30 నిమిషాలు క్రీజులో ఉంటే.. ఆ మ్యాచ్‌లోనే గెలిచేవాళ్లమని పంత్ అంటున్నాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

‘‘సిడ్నీ టెస్టులో శతకం కోల్పోయాను. అయితే మరో 30 నిమిషాలు లేదా గంట సేపు నేను క్రీజులో ఉంటే మనం మరో విజయం సాధించేవాళ్లం. ఆ సమయంలో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి అన్నిసార్లు అలాంటి అవకాశాలు రావు. కానీ, తర్వాత మ్యాచ్‌లోనే నాకు అలాంటి సందర్భం ఎదురైంది. దీంతో జట్టును గెలిపించాలని భావించా. దానిపైనే దృష్టిసారించి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి విజయం సాధించా’’ అని పంత్‌ తెలిపాడు.

సిడ్నీ టెస్టులో పంత్‌ 97 పరుగులు సాధించాడు. అయితే అతడు క్రీజులో ఉన్నంతసేపు భారత్‌ ఫేవరేట్‌గా నిలిచింది. కానీ అతడు ఔటైన తర్వాత మ్యాచ్ పరిస్థితి మారిపోయింది. ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టుబిగించింది. కానీ, రవిచంద్రన్ అశ్విన్‌, హనుమ విహారి అద్భుత పోరాటంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి

ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మూడు రోజులే అవకాశం

కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్‌ సాయం: తైబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని