IND vs SA: నీ లాంటి వాళ్లు జిమ్‌కు వెళితే.. చాహల్‌ని ఆటపట్టించిన రుతురాజ్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమ్‌ఇండియా మూడో మ్యాచ్‌లో పుంజుకుంది. సౌతాఫ్రికా 48 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మూడో టీ20లో భారత

Published : 17 Jun 2022 02:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమ్‌ఇండియా మూడో మ్యాచ్‌లో పుంజుకుంది. సౌతాఫ్రికాపై 48 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మూడో టీ20లో భారత ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధ శతకాలతో అలరించగా.. మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌ ముగిసిన అనంతరం రుతురాజ్‌ గైక్వాడ్‌ని చాహల్‌  సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఫిట్‌నెస్‌ గురించి చర్చ వచ్చింది. బక్కపలుచగా ఉన్న చాహల్‌ శరీరాకృతి గురించి రుతురాజ్ గైక్వాడ్ సరదాగా కామెంట్ చేసి ఆటపట్టించాడు. దానికి చాహల్‌ కూడా తనదైన శైలిలో స్పందించాడు.‘మా ప్రధాన బలమైన చాహల్‌ని అద్భుతంగా వినియోగిస్తున్న శిక్షకులకు ధన్యవాదాలు. మీలాంటి వ్యక్తులు జిమ్‌కి వెళ్లినప్పుడు మీరు మమ్మల్ని ఉత్సాహపరుస్తారు’ అని చాహల్‌తో రుతురాజ్‌ గైక్వాడ్ సరదాగా అన్నాడు. అక్కడి వాతావరణాన్ని మరింత హాస్యభరితం చేయడానికి  ‘నాలాంటి వాళ్లు అంటే నీ ఉద్దేశం ఏంటి’ అని  చాహల్‌ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు