French Open: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత స్వైటెక్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో స్వైటెక్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించి టైటిల్‌ను సాధించింది.

Updated : 10 Jun 2023 22:02 IST

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో స్వైటెక్‌ (పోలెండ్‌) అదరగొట్టింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను 6-2, 5-7, 6-4 తేడాతో ఓడించి టైటిల్‌ పట్టేసింది. దీంతో ఎర్రమట్టి కోర్టులో వరుసగా రెండో సారి, నాలుగేళ్లలో మూడో సారి టైటిల్‌ సాధించింది. మరోవైపు 2020, 2022లో స్వైటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు నెగ్గింది. నిరుడు యూఎస్‌ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచింది.

శనివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ రసవత్తరంగా సాగింది. మొదటి సెట్‌లో స్వైటెక్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. కానీ, అనూహ్యంగా పుంజుకొన్న ముచోవా రెండో సెట్‌లో పైచేయి సాధించింది. అనంతరం విజయం మూడో సెట్‌ మీద ఆధారపడడంతో ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. ముచోవా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆఖర్లో స్వైటెక్‌ను విజయం వరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని