IND vs ENG: హాకీ ప్రపంచకప్‌.. ఇంగ్లాండ్‌తో పోరు.. భారత్‌కు ఆ విభాగమే కీలకం!

హాకీ ప్రపంచకప్‌లో (Hockey World Cup) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్‌ (Team India)కు కీలక పోరు. పూల్‌ - డిలో ఇంగ్లాండ్‌ను (England)తో తలడపేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. 

Published : 15 Jan 2023 18:20 IST

ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై అద్భుతమైన విజయంతో ప్రపంచకప్‌ టోర్నీని ఆరంభించిన టీమ్‌ఇండియా హాకీ జట్టు.. ఇవాళ మరో కీలక పోరుకు సిద్ధమైంది. పటిష్టమైన ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. ఇందులో గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొనే అవకాశం ఉంది. స్పెయిన్‌పై భారత్‌ 2-0 తేడాతో విజయం సాధించగా.. వేల్స్ మీద ఇంగ్లాండ్‌ 5-0 సూపర్‌ విక్టరీ సాధించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో పోరు ఆషామాషీగా ఉండబోదు. 

అటాకింగ్‌, డిఫెన్స్‌ విభాగాల్లో అద్భుతంగా ఆడుతున్న కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ సింగ్ నాయకత్వంలోని భారత్‌ పెనాల్టీ కార్నర్‌ విభాగంలో తడబాటుకు గురవుతోంది. స్పెయిన్‌ మీద కూడా ఈ విషయంలో ఇబ్బంది పడింది. ఇంగ్లాండ్‌పై ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పోరాడాల్సి ఉంది. వేల్స్‌పై దూకుడైన ఆటతీరుతో విక్టరీ సాధించిన ఇంగ్లాండ్‌ను కట్టడి చేయాలంటే భారత్‌ తీవ్రంగా కష్టపడాల్సిందే. 

టీమ్‌ఇండియాలో కీలకం వీరే..

కెప్టెన్ హర్మన్ ప్రీత్‌, రోహిదాస్‌.. ఇద్దరూ అద్భుతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థులను కట్టడి చేయగలరు. అలాగే హార్దిక్‌ సింగ్‌ ప్రత్యర్థి డిఫెన్స్‌ ఛేదించుకొని మరీ గోల్స్‌ చేయగల సమర్థుడు.  అయితే పెనాల్టీ కిక్‌లను గోల్స్‌గా మలిస్తేనే ఇంగ్లాండ్‌పై భారత్‌ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. అటాకింగ్‌, డిఫెన్స్‌తో ఇంగ్లాండ్‌ను కట్టడి చేయాలని భారత్‌ భావిస్తోంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే దాదాపు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకొన్నట్లే అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని