తొలిసారిగా భారత్‌తో భారత్‌-ఏ టెస్టు మ్యాచు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత్‌, భారత్‌-ఏ నాలుగు రోజుల సన్నాహక టెస్టులో తలపడనున్నాయి. ఈ ఏడాది జులైలో జరిగే ఈ పోరుకు నార్తాంప్టన్‌షైర్‌ కౌంటీ మైదానం వేదిక కానుంది. తేదీలు మాత్రం ఇంకా నిర్ణయించలేదు. సాధారణంగా ఏదైనా జట్టు విదేశాల్లో పర్యటిస్తే అక్కడి...

Published : 28 Jan 2021 23:06 IST

లండన్‌: గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత్‌, భారత్‌-ఏ నాలుగు రోజుల సన్నాహక టెస్టులో తలపడనున్నాయి. ఈ ఏడాది జులైలో జరిగే ఈ పోరుకు నార్తాంప్టన్‌షైర్‌ కౌంటీ మైదానం వేదిక కానుంది. తేదీలు మాత్రం ఇంకా నిర్ణయించలేదు. సాధారణంగా ఏదైనా జట్టు విదేశాల్లో పర్యటిస్తే అక్కడి ‘ఏ’ జట్టుతో సాధన మ్యాచుల్లో పోటీపడుతుంది. తీరిక లేని షెడ్యూలు, బయో బుడగ వల్ల ఈ సారి భారత్‌తో భారత్‌-ఏ తలపడుతుండటం గమనార్హం.

ఐదు టెస్టుల సిరీసు కోసం టీమ్‌ఇండియా ఆగస్టు, సెప్టెంబర్లో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. తొలిటెస్టు ఆగస్టు 4న నాటింగ్‌హామ్‌లో మొదలవుతుంది. ‘భారత్‌, భారత్‌-ఏకు మేం స్వాగతం పలుకుతున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్లు ఈ వేసవిలో కౌంటీ గ్రౌండ్‌లో తలపడనున్నారు’ అని నార్తాంప్టన్‌ షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ తెలిపింది.

‘ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా నాలుగు రోజుల సన్నాహక టెస్టులో భారత్‌-ఏతో తలపడనుంది. జులై 28న రెండో వార్మప్‌ మ్యాచ్‌ కోసం భారత బృందం అక్కడి నుంచి లీసెస్టర్‌షైర్‌కు చేరుకుంటుంది’ అని కౌంటీ క్లబ్‌ వెల్లడించింది.

నాటింగ్‌హామ్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఆగస్టు 4-8 వరకు తొలి టెస్టు జరగనుంది. ఇక రెండు (ఆగస్టు 12-16), నాలుగో టెస్టు (సెప్టెంబర్‌ 2-6)లకు వేదిక లండన్‌. మూడో (ఆగస్టు 25-29) టెస్టు లీడ్స్‌, ఐదో టెస్టు (సెప్టెంబర్‌ 10-14)కు మాంచెస్టర్లో జరుగుతాయి.‌ ప్రస్తుతం ఇంగ్లాండ్‌.. భారత్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టుతో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది.

ఇవీ చదవండి
బౌలర్లు బౌండరీలు ఇస్తే.. శాస్త్రి అరిచేస్తాడు
థాంక్యూ.. టీమ్‌ఇండియా అంటున్న లైయన్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని