Published : 23 Sep 2021 02:12 IST

Kartik Tyagi : అరె! ఎవరీ ఆటగాడు నీరజ్‌ చోప్రాలానే ఉన్నాడే!

చండీగఢ్‌: ఏంటి అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా సడెన్‌గా ఐపీఎల్‌ ఆడుతున్నాడేంటి అనుకున్నారా? అయితే మీరు పొరపడినట్లే. ఎందుకుంటే మీరు చూసేది రాజస్థాన్‌ రాయల్స్‌ యువ పేసర్‌ కార్తీక్ త్యాగిని. మంగళవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్‌ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు అవసరం కాగా.. ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో రాజస్థాన్‌కు ఊహించని విజయం దక్కింది. దుబాయ్‌ స్టేడియంలో ఒక్కసారిగా దంచి కొట్టిన ఈ ఆటగాడు లుక్స్‌ అమాంతం నీరజ్‌ చోప్రాని గుర్తుచేశాలా ఉన్నాయని అంటున్నారు వీక్షకులు. అంతే కాదు.. నీరజ్‌కి ట్విన్‌ బ్రదర్‌లా ఉన్నాడంటూ కాసేపు ట్విటర్‌లో చర్చలు జరిపారు క్రీడాభిమానులు.





Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని