Kartik Tyagi : అరె! ఎవరీ ఆటగాడు నీరజ్‌ చోప్రాలానే ఉన్నాడే!

ఏంటి అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా సడెన్‌గా ఐపీఎల్‌ మ్యాచ్లో ఆడుతున్నాడేంటి అనుకున్నారా? అయితే మీరు పొరపడినట్లే. ఎందుకుంటే మీరు చూసేది రాజస్థాన్‌ రాయల్స్‌ యువ పేసర్‌ కార్తీక్ త్యాగిని. మంగళవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్‌ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు అవసరం కాగా..

Published : 23 Sep 2021 02:12 IST

చండీగఢ్‌: ఏంటి అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా సడెన్‌గా ఐపీఎల్‌ ఆడుతున్నాడేంటి అనుకున్నారా? అయితే మీరు పొరపడినట్లే. ఎందుకుంటే మీరు చూసేది రాజస్థాన్‌ రాయల్స్‌ యువ పేసర్‌ కార్తీక్ త్యాగిని. మంగళవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్‌ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు అవసరం కాగా.. ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో రాజస్థాన్‌కు ఊహించని విజయం దక్కింది. దుబాయ్‌ స్టేడియంలో ఒక్కసారిగా దంచి కొట్టిన ఈ ఆటగాడు లుక్స్‌ అమాంతం నీరజ్‌ చోప్రాని గుర్తుచేశాలా ఉన్నాయని అంటున్నారు వీక్షకులు. అంతే కాదు.. నీరజ్‌కి ట్విన్‌ బ్రదర్‌లా ఉన్నాడంటూ కాసేపు ట్విటర్‌లో చర్చలు జరిపారు క్రీడాభిమానులు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని