Hardik Pandya: స్టోక్స్‌ కంటే హార్దిక్‌ పాండ్యనే బెస్ట్‌ ఆల్‌రౌండర్‌.. కేవలం ఒక్క ఫార్మాట్‌లోనే!

బెన్‌ స్టోక్స్‌ కంటే హార్దిక్ పాండ్య ఉత్తమ ఆల్‌రౌండర్‌గా షేన్‌ వాట్సన్‌ పేర్కొన్నాడు. పాండ్య ప్రస్తుత ఫామ్‌ ప్రకారం పొట్టి ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషిస్తాడని విశ్లేషించాడు.  

Published : 03 Oct 2022 01:21 IST

ఆసీస్‌ మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్ విశ్లేషణ

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభానికి ఇంకో రెండు వారాలు మాత్రమే మిగిలుంది. ఇప్పటికే జట్లన్నీ సమాయత్తం అవుతుండగా.. విశ్లేషకులు  కూడా ఫేవరేట్‌ టీమ్‌, కీలకంగా మారే ఆటగాళ్లు ఎవరనేది అంచనా వేస్తున్నారు. మెగా టోర్నీలో ఏ ఆల్‌రౌండర్‌ రాణిస్తాడనే చర్చ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా టీమ్‌ఇండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్య.. ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్ మధ్యే పోటీ జరుగుతోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్ మాత్రం హార్దిక్‌ వైపు కాస్త మొగ్గు చూపాడు. అయితే టీ20ల్లోనే బెన్‌ స్టోక్స్ కంటే హార్దిక్‌ ఉత్తమ ఆల్‌ రౌండర్‌ అని పేర్కొన్నాడు. లెజెండ్స్‌ లీగ్ క్రికెట్‌ టోర్నీలో ఆడుతోన్న వాట్సన్‌ తాజాగా స్పందించాడు.

‘‘ప్రస్తుతం హార్దిక్‌ పాండ్య అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటప్పుడు అతడి ఆటను చూడటం బాగుంటుంది. ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటం నాకిష్టం. ప్రత్యర్థి నుంచి ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్‌ను లాగేసుకోగల సత్తా హార్దిక్‌కు ఉంది. బ్యాట్‌తోనైనా.. బంతితోనైనా రాణించగలడు. అందుకే టీ20 ఫార్మాట్‌లో బెన్‌ స్టోక్స్‌ కంటే హార్దిక్‌ శక్తిసామర్థ్యాలు అధికమని నా భావన’’ అని వాట్సన్‌ వెల్లడించాడు. భారత టీ20 లీగ్‌ గత సీజన్‌ ముందు వరకు గాయాల కారణంగా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయిన హార్దిక్‌ పాండ్య.. ఆ తర్వాత గుజరాత్‌కు కెప్టెన్‌గా టైటిల్‌ అందించడంతోపాటు ఫామ్‌ అందిపుచ్చుకొని ద్వైపాక్షిక సిరీసుల్లో రాణిస్తున్నాడు. దీంతో వచ్చే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తరఫున కీలక పాత్ర పోషిస్తాడని అంతా అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని