వారెవ్వా..సూపర్‌మ్యాన్‌ క్యాచ్‌ ఇది!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో మరో కళ్లుచెదిరే క్యాచ్‌.  బ్రిస్బేన్‌ హీట్‌ ఆటగాడు బెన్‌ లాఫ్లిన్‌ సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు....

Published : 30 Jan 2021 01:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో మరో కళ్లుచెదిరే క్యాచ్‌.  బ్రిస్బేన్‌ హీట్‌ ఆటగాడు బెన్‌ లాఫ్లిన్‌ సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. అడిలైడ్ స్టైకర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆఫ్‌స్టంప్‌ అవతలకు లబుషేన్‌ వేసిన లో ఫుల్‌టాస్‌ను మైకేల్‌ నెసర్‌.. కవ్‌ కార్నర్‌ (డీప్‌ మిడ్‌ వికెట్‌-లాంగ్‌ ఆన్ మధ్యలో) మీదగా భారీ షాట్ ఆడాడు. లాంగ్‌ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లాఫ్లిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అద్భుతమైన క్యాచ్‌, సూపర్‌మ్యాన్‌లా లాఫ్లిన్‌‌ క్యాచ్‌ అందుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో అడిలైడ్‌పై బ్రిస్బేన్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్‌ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన బ్రిస్బేన్‌ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇవీ చదవండి

పఠాన్‌.. పాక్‌పై నీ హ్యాట్రిక్‌ ఇంకా గుర్తుంది

రబాడ సాధించేది తల్చుకుంటే భయమేస్తుంది


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని