IND vs AUS: నాలుగో టెస్టుకూ కమిన్స్‌ దూరం.. కెప్టెన్‌గా స్మిత్‌ కొనసాగింపు

అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరగనున్న నాలుగో టెస్టుకు ఆసీస్‌ కెప్టెన్‌ పాట్ కమిన్స్‌  (Pat Cummins) దూరమయ్యాడు. 

Published : 06 Mar 2023 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసుకోవడానికి భారత్‌తో రెండో టెస్టు ముగిసిన అనంతరం ఆసీస్‌ కెప్టెన్‌ పాట్ కమిన్స్‌ (Pat Cummins) స్వదేశానికి పయనమైన సంగతి తెలిసిందే. మూడో టెస్టుకు అందుబాటులో లేని అతడు.. నాలుగో టెస్టు కూడా దూరమయ్యాడు. మూడో టెస్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా నియమితుడైన స్టీవ్‌ స్మిత్‌.. నాలుగో టెస్టుకూ సారథ్య  (Steve Smith) బాధ్యతలు చూసుకుంటాడు. టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు కమిన్స్‌ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టతనివ్వలేదు. కానీ, ఫాస్ట్‌ బౌలర్‌ జే రిచర్డ్‌ సన్‌ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో నాథన్‌ ఎల్లిస్‌ని జట్టులోకి తీసుకుంది. 

ఇదిలా ఉండగా.. బోర్గర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. మొదటి రెండు టెస్టుల్లో టీమ్‌ఇండియా ( Team India) విజయం సాధించింది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపొంది డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) బెర్తుని ఖరారు చేసుకుంది. మార్చి 9 - 13 మధ్య అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. జూన్‌ 7-11 మధ్య లండన్‌లోని ది ఒవెల్ మైదానంలో  (WTC Final)ను నిర్వహించనున్నారు. జూన్‌ 12 తేదీని రిజర్వ్‌ డేగా ప్రకటించారు. 2025 టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ కూడా ఇదే మైదానంలో జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు