గబ్బా టెస్టు: టీ విరామానికి భారత్‌ 183/3

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి 63 ఓవర్లలో 183/3తో నిలిచింది...

Published : 19 Jan 2021 10:23 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి 63 ఓవర్లలో 183/3తో నిలిచింది. క్రీజులో ఛెతేశ్వర్‌ పుజారా(43), రిషభ్‌పంత్‌(10) ఉన్నారు. అంతకుముందు కెప్టెన్‌ అజింక్య రహానె(24) ధాటిగా ఆడే క్రమంలో కమిన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 167/3గా నమోదైంది. ఆపై పుజారా, పంత్‌ నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే పంత్‌ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. భారత్‌ తరఫున అతి తక్కువ 27 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ధోనీ 32 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత్‌ విజయానికి చివరి సెషన్‌లో 145 పరుగులు కావాలి. 
ఇవీ చదవండి..
స్మిత్‌ చూస్తుండగానే రోహిత్‌ షాడో బ్యాటింగ్‌
సిరాజ్‌.. ఇక కుర్రాడు కాదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని