లబుషేన్‌ శతకం.. వేడ్‌ ఔట్‌

టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌(101* ; 195 బంతుల్లో 9x4) శతకం సాధించాడు...

Updated : 15 Jan 2021 11:25 IST

గబ్బా: టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌(101* ; 195 బంతుల్లో 9x4) శతకం సాధించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే డేవిడ్‌ వార్నర్‌(1) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన లబుషేన్‌.. స్మిత్‌(36)తో కలిసి మూడో వికెట్‌కు  70 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఇక రెండో సెషన్‌లో స్మిత్‌ ఔటయ్యాక వేడ్‌(45; 87 బంతుల్లో 6x4)తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఈ క్రమంలోనే సిరాజ్‌ వేసిన 63వ ఓవర్‌ చివరి బంతికి 4 పరుగులు చేసిన లబుషేన్ టెస్టుల్లో 5వ‌ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 50 పరుగుల లోపే అతడు రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలుత రహానె క్యాచ్‌ వదలగా, రెండోసారి పుజారా స్లిప్‌లో అందుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడు శతకంతో కదం తొక్కాడు. ఇక నటరాజన్‌ వేసిన 64వ ఓవర్‌లో వేడ్‌ గాల్లోకి షాట్‌ ఆడడంతో ఠాకుర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 64 ఓవర్లలో 200/4తో నిలిచింది.

ఇవీ చదవండి..

60 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా 20 ఆటగాళ్లతో.. 

‘అశ్విన్‌ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని