IND vs BAN: బంగ్లాతో తొలి టెస్ట్‌: టాస్‌ నెగ్గిన భారత్‌

బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌కు భారత్‌ సిద్ధమైంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది.

Updated : 14 Dec 2022 10:03 IST

చట్‌గామ్‌: బంగ్లాదేశ్‌తో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌కు భారత్‌ సిద్ధమైంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన టీమ్‌ ఇండియా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ సుదీర్ఘ ఫార్మాట్లో బంగ్లాదేశ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓడలేదు. అవమానకర రీతిలో బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌ కోల్పోయిన భారత్‌.. దెబ్బకు దెబ్బ తీస్తుందా? చూడాల్సిందే. 

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్‌, రవిచంద్రన్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, ఉమేశ్‌ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌

బంగ్లాదేశ్‌: జకీర్ హసన్, నజ్ముల్ హోస్సేన్ షాంటో, లిటన్ దాస్, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నురుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, ఖలిద్ అహ్మద్, ఎబాడట్‌ హోస్సేన్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని