IND VS ENG: లార్డ్స్‌లో కొత్త రికార్డులు నమోదవుతాయా?

లార్డ్స్‌  స్టేడియంలో మ్యాచ్‌ అంటే ...ఏ జట్టుకైనా ప్రత్యేకమే. ఐదు వన్డే ప్రపంచకప్‌లతో పాటు ఎన్నో కీలక సమరాలకి వేదికగా నిలిచింది.

Updated : 08 Dec 2022 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లార్డ్స్‌  స్టేడియంలో మ్యాచ్‌ అంటే ...ఏ జట్టుకైనా ప్రత్యేకమే. ఐదు వన్డే ప్రపంచకప్‌లతో పాటు ఎన్నో కీలక సమరాలకి వేదికగా నిలిచింది. 2011 వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత  జట్టుకు వచ్చిన అపూర్వ విజయాలంటే ..అవి లార్డ్స్‌లో జరిగిన కపిల్ దేవ్‌ సారధ్యంలోని 1983 ప్రపంచకప్‌, గంగూలీ నాయకత్వంలోని 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌...వీటిని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరగనున్న రెండో వన్డేలో రోహిత్‌ కెప్టెన్సీలో మరో గొప్ప విజయం అందుకొని సిరీస్‌ నెగ్గాలని చూస్తుంది. 

లార్డ్స్ స్టేడియంలో వన్డే గణాంకాలు

ఈ మైదానంలో టీమ్‌ఇండియా 8 వన్డేలు ఆడగా నాలుగింట్లో గెలిచి..మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు.

* ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు: 334/4 (ఇంగ్లాండ్)

* భారత జట్టు సాధించిన అత్యధిక స్కోరు: 326/8 (ఇంగ్లాండ్‌పై)

* ఒక జట్టు అత్యల్ప మొత్తం: 107 ఆలౌట్, దక్షిణాఫ్రికా

* టీమ్‌ఇండియా అత్యల్పస్కోరు: 132/3 (1975లో ఇంగ్లాండ్‌పై)

* అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు: మార్కస్ ట్రెస్కోథిక్ ( 595 ), ఇంగ్లాండ్‌

* టీమ్‌ఇండియా తరఫున అత్యధిక పరుగులు: సౌరభ్‌ గంగూలీ ( 208 )

 * అత్యధిక వ్యక్తిగత స్కోరు: వివ్ రిచర్డ్స్ ( 138 ), వెస్టిండీస్‌

 * భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు: సౌరభ్‌ గంగూలీ ( 90 )

*  అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌: డారెన్ గోఫ్ (27), ఇంగ్లాండ్‌

*  అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన: షాహీన్ అఫ్రిది (6/35), పాకిస్థాన్‌

*  భారత్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్‌: మొహిందర్‌ అమర్‌నాథ్ (3/12)

* అత్యధిక క్యాచ్‌లు : జేమ్స్ ఆండర్సన్ (8), ఇంగ్లాండ్‌

* అత్యధిక భాగస్వామ్యం: ఆండ్రూ స్ట్రాస్, ఆండ్రూ ఫ్లింటాఫ్ ( 226 )

* భారత్‌ తరఫున అత్యధిక భాగస్వామ్యం: ఎస్ రైనా, ఎంఎస్ ధోనీ (169)

* మూడేళ్ల కిందట ఇదే రోజున (జులై 14) వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌ నెగ్గింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగిసినా.. బౌండరీల ఆధారంగా కివీస్‌పై విజయం సాధించి తొలి కప్‌ను సొంతం చేసుకుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని