Published : 05 Jul 2022 16:17 IST

IND vs ENG: విజయానికి మరింత చేరువైన ఇంగ్లాండ్‌

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జోరూట్‌ (126) మ్యాచ్‌ను త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. దీంతో అతడు బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. మరోవైపు జానీ బెయిర్‌ స్టో (98) శతకానికి చేరువయ్యాడు. ఇంగ్లాండ్‌ ప్రస్తుతం 72 ఓవర్లకు 346/3తో నిలిచి విజయానికి మరింత చేరువైంది. ఆ జట్టు విజయానికి ఇంకా 34 పరుగులే కావాలి. కాగా, ఇంగ్లాండ్‌ స్కోర్‌ 109 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌కు టెస్టుల్లో అతిగొప్ప విజయం అందించేందుకు కృషి చేస్తున్నారు.


 

బర్మింగ్‌హామ్‌: జోరూట్‌ (108) శతకం బాదాడు. బుమ్రా వేసిన 66వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన అతడు తర్వాత సిరాజ్‌ వేసిన 67వ ఓవర్‌ తొలి బంతికి సెకండ్‌ స్లిప్‌ తలమీదుగా మరో బౌండరీ బాదాడు. దీంతో ఈ ఏడాది ఐదో శతకం అందుకోవడమే కాకుండా మొత్తం టెస్టుల్లో 28వ శతకం సాధించాడు. మరోవైపు బెయిర్‌స్టో (92) పరుగులతో ఉన్నాడు. దీంతో ఇంగ్లాండ్‌ 67 ఓవర్లు పూర్తయ్యేసరికి 319/3తో కొనసాగుతోంది. ఆ జట్టు విజయానికి ఇంకా 59 పరుగులే అవసరమయ్యాయి.


బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియాతో ఆడుతోన్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు జోరూట్‌ (82), జానీ బెయిర్‌స్టో (85) నిలకడగా ఆడుతున్నారు. దీంతో వీరిద్దరూ 168 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించి ఆ జట్టును విజయంవైపు తీసుకెళ్తున్నారు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 259/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన ఇద్దరూ భారత బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్‌ 60 ఓవర్లకు 282/3తో నిలిచింది. కాగా, ఇంగ్లాండ్‌ విజయానికి 96 పరుగులు అవసరం కాగా టీమ్‌ఇండియా విజయం సాధించాలంటే 7 వికెట్లు తీయాలి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని