IND vs ENG: యువరాజ్‌ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టులో  జస్ప్రిత్‌ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత తొలి ఇన్నింగ్స్‌ 84 ఓవర్లలో బుమ్రా స్టువర్ట్‌ బ్రాడ్‌కు చుక్కలు

Published : 03 Jul 2022 01:45 IST

 బ్రాడ్‌ ఓవర్‌లో 35 పరుగులు.. వరల్డ్‌ రికార్డు బ్రేక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టులో జస్ప్రిత్‌ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత తొలి ఇన్నింగ్స్‌ 84 ఓవర్లలో బుమ్రా స్టువర్ట్‌ బ్రాడ్‌కు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో ఏకంగా 35 పరుగులు రాబట్టి టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకముందు వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా 2003లో (దక్షిణాఫ్రికా బౌలర్‌ పీటర్సన్‌) ఓవర్లలో 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. ఇప్పుడు బుమ్రా దెబ్బకు లారా రికార్డు బద్దలైంది.
బ్రాడ్‌ vs బుమ్రా పోరు సాగిందిలా..
తొలి బంతి:  ఫోర్‌
రెండో బంతి: 5 వైడ్స్‌
రెండో బంతి: సిక్స్‌ (నోబాల్‌)
రెండో బంతి: ఫోర్‌
మూడో బంతి: ఫోర్‌
నాలుగో బంతి: ఫోర్‌
ఐదో బంతి: సిక్స్‌
ఆరో బంతి: ఒక్క పరుగు
(తొలి మూడు బంతులు పూర్తయ్యేసరికి బ్రాడ్ 24 పరుగులు ఇచ్చేయడం గమనార్హం.) 
టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగుల జాబితా 

  • 35  జస్ప్రిత్‌ బుమ్రా (స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో) బర్మింగ్‌హామ్‌ 2022*
  • 28 బ్రియన్‌ లారా (ఆర్‌ పీటర్సన్‌ బౌలింగ్‌లో) జొహెన్నెస్‌బర్గ్‌ 2003
  • 28 జార్జ్‌ బెయిలీ (జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో) పెర్త్‌ 2013
  • 28 కేశవ్‌ మహారాజ్‌ (జో రూట్‌ బౌలింగ్‌లో) పోర్ట్‌ ఎలిజిబెత్‌ 2020

బ్రాడ్‌ చెత్త రికార్డు

యువరాజ్‌సింగ్‌ 2007 టీ 20 ప్రపంచకప్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు బ్రాడ్ మూటగట్టుకున్నాడు. తాజాగా ఈ టెస్టు మ్యాచ్‌లో బుమ్రాకు 35 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టెస్టు, టీ 20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. వన్డేల్లో నెదర్లాండ్‌ బౌలర్‌ డీఎల్‌ఎస్‌ వాన్‌ బంజ్‌ ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు (36) ఇచ్చాడు. ఇతడి బౌలింగ్‌లోనే దక్షిణాఫ్రికా బ్యాటర్‌ హర్షల్‌ గిబ్స్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని