IND vs ENG: ఇంగ్లాండ్‌లో గెలవడం అంత తేలిక కాదు.. పంత్‌పై ప్రశంసల జల్లు..!

టీమ్‌ఇండియా యువ సంచలనం రిషబ్‌పంత్‌పై మాజీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌పై ఎడ్జ్‌బాస్టన్‌లో

Updated : 18 Jul 2022 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ సంచలనం రిషబ్‌పంత్‌పై మాజీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌పై ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో అద్భుత శతకంతో రాణించి అందరినీ మెప్పించిన పంత్.. తాజాగా సిరీస్‌ నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లోనూ అజేయ శతకంతో మరోసారి టీమ్‌ఇండియాను ఆదుకున్నాడు. 260 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 38 పరుగులకే టాప్‌ 3 బ్యాటర్లను కోల్పోయింది. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ (125 నాటౌట్‌; 113 బంతుల్లో 16x4, 2x6) ఆడి జట్టును గెలిపించాడు. దీంతో తన వన్డే కెరీర్‌లో తొలి శతకం నమోదు చేయడంతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు సొంతం చేసుకొన్నాడు.

పంత్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లపై వారి సొంతగడ్డపైనే శతకాలు బాది గొప్ప బ్యాటర్‌గా పేరుపొందాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో పంత్‌ టీ20లు, వన్డేలకు పనికిరాడనే విమర్శలు వినిపించాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలం అయిన తరవాత పంత్‌పై మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, కోచ్‌ ద్రవిడ్‌ మాత్రం పంత్‌కు మద్దతుగా నిలిచాడు. పంత్‌ సామర్థ్యం మాకు తెలిసని, భారత జట్టులో అతడు అంతర్భాగమని చెప్పాడు. గురువు ఆశించినట్లుగానే గొప్ప ఇన్నింగ్స్‌తో.. టీమ్‌ఇండియాలో తన ప్రాధాన్యం ఏంటో పంత్ విమర్శకులకు చూపించాడు. మరోవైపు మాజీ క్రికెటర్లు పంత్ ఆట తీరును కొనియాడుతూ సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని