Rohit sharma: హిట్‌మ్యాన్‌పై అనుమానమే లేదు!

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ 2019 వన్డే ప్రపంచకప్‌ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేస్తాడని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసులో అతడు భారీ స్థాయిలో పరుగులు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ..

Published : 08 Jul 2021 11:00 IST

2019 ప్రదర్శన పునరావృతం చేస్తాడన్న సన్నీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ 2019 వన్డే ప్రపంచకప్‌ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేస్తాడని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసులో అతడు భారీ స్థాయిలో పరుగులు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లిష్‌ పిచ్‌లపై అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌ను చక్కగా మార్చుకున్నాడని వెల్లడించాడు.

‘ఇంగ్లాండ్‌లో రెండేళ్ల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ ఐదు శతకాలు చేయడం మనం చూశాం. సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికాలోని కఠినమైన పిచ్‌పై, చల్లని వాతావరణంలో అద్భుతమైన శతకం చేశాడు. పరిస్థితులకు తగ్గట్టుగా టెక్నిక్‌ను మార్చుకున్నాడు. ఈ రెండేళ్లలో అతడు మరింత అనుభవం సంపాదించాడు. ఈ టెస్టు సిరీసులో అతడు అలాంటి ప్రదర్శనే పునరావృతం చేస్తే నాకేమీ ఆశ్చర్యం లేదు’ అని గావస్కర్‌ అన్నాడు.

గత ప్రపంచకప్‌లో రోహిత్‌ ఐదు శతకాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సఫారీలపై సౌథాంప్టన్‌లో 122 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. 13 బౌండరీలు, 2 సిక్సర్లు బాదేశాడు. ఇక త్వరలో జరిగే ఐదు టెస్టుల సిరీసులో హిట్‌మ్యాన్‌ కీలకం కానున్నాడు. ఓపెనర్‌గా అతడు చేసే పరుగులే జట్టుకు కీలకం కానున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ అతడు శుభారంభమే అందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు