Ind vs Eng: జోడీ కుదిరింది.. టాప్‌ లేపింది!

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1 తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే, మాంచెష్టర్‌ వేదిక

Updated : 18 Jul 2022 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1 తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే, మాంచెష్టర్‌ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు ఆరంభంలోనే కట్టడిచేశారు. దీంట్లో విరాట్‌కోహ్లీ పాత్రకూడా ఉంది. విరాట్‌ బౌలింగ్‌ చేయకపోయినా చిట్కాలను సిరాజ్‌కిచ్చి ఫలితం రాబట్టాడు. సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌ మూడోబంతిని బెయిర్‌స్టో లెగ్‌సైడ్‌ ఆడదామనుకొన్నా, బంతిని అంచనా వేయలేక మిడ్ఆఫ్‌లోఉన్న ఫీల్డర్ శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరవాత జో రూట్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. ఆ సమయంలో కోహ్లీ..సిరాజ్‌తో మాట్లాడి సలహాలు ఇస్తున్నాట్లు కనిపించాడు. అదే ఓవర్‌ చివరి బంతిని సిరాజ్‌ స్వింగ్ చేస్తూ ఆఫ్‌ స్టంఫ్‌ మీదుగా సంధించాడు. అయితే, బ్యాటర్ రూట్‌ బంతిని అడ్డుకునే ప్రయత్నంలో రెండో స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మకు క్యాచ్‌ ఇచ్చి దొరికిపోయాడు. దీంతో ఒకే ఓవర్లలో ఇద్దరు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్సమన్‌లను పెవిలియన్ కు పంపి సిరాజ్‌ టీమ్‌ఇండియాకు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. రూట్‌ ఔట్‌ అయిన వెంటనే కోహ్లీ వైపు చూస్తూ సిరాజ్‌ ఎగిరిగంతెయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌కు బుమ్రా స్థానంలో వచ్చిన సిరాజ్‌ పవర్‌ ప్లేలో ఇద్దరు కీలక బ్యాటర్లను డకౌట్‌ చేయడం విశేషం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని