
IND vs ENG: తొలి రోజు ముగిసిన ఆట..42 పరుగుల అధిక్యంలో ఇంగ్లాండ్
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్, టీమ్‌ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు అతిథ్య జట్టు అధిపత్యం ప్రదర్శించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల స్వల్ప అధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్లు రోరీ బర్న్స్(52), హసీబ్ హమీద్(60) అర్ధశతకాలతో అదరగొట్టారు. వీరిద్దరూ భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 78 పరుగులకే ఆలౌటైంది. భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. టీమ్‌ఇండియా ఆటగాళ్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. రోహిత్ శర్మ (19) టాప్ స్కోరర్. అజింక్యా రహానె(18) పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్(0), చతేశ్వర్ పుజారా (1), విరాట్ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్ 3, రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఐదు క్యాచులు అందుకోవడం విశేషం.