IND vs ENG: జేమ్స్‌ అండర్సన్‌ కొత్త రికార్డు..

టీమ్ఇండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్  సరికొత్త రికార్డును నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజింక్య రహానెను ఔట్‌ చేయడం ద్వారా అండర్సన్‌.. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వికెట్లు (400) తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ఈ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం స్టువర్ట్ బ్రాడ్(341 వికెట్లు)కి మాత్రమే ఉంది. అతని తర్వాత స్థానంలో ఫ్రెడ్ ట్రూమన్‌ (241 వికెట్లు)ఉన్నాడు.

Updated : 28 Aug 2021 23:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్  సరికొత్త రికార్డు నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజింక్య రహానెను ఔట్‌ చేయడం ద్వారా అండర్సన్‌.. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వికెట్లు (400) పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ఈ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం స్టువర్ట్ బ్రాడ్ (341 వికెట్లు)కి మాత్రమే ఉంది. అతడి తర్వాత స్థానంలో ఫ్రెడ్ ట్రూమన్‌ (241 వికెట్లు) ఉన్నాడు.

ఇక, ఓవరాల్‌గా  సొంత గడ్డపై 400 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అండర్సన్‌ (400), అనిల్‌ కుంబ్లే (350), స్టువర్ట్‌ బ్రాడ్‌ (341),షేన్‌ వార్న్‌(319) తర్వాతి స్థానాల్లో  ఉన్నారు. ఇదిలా ఉండగా.. మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌటైన కోహ్లీ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో  432 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి సిరీస్‌ని 1-1 సమం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని